Crime: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. తల్లిదండ్రుల ఆత్మహత్య

Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides
Crime: Tragedy in Telangana.. A couple got married and drank pesticides

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తమను కాదని ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోవడాన్ని ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం కేరళలోని కొల్లం జిల్లాలో చోటుచేసుకుంది. కాలేజీ వెళ్లే తమ కూతురు ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఉన్ని కృష్ణ పిళ్లై, బిందు దంపతులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మోతాదుకు మించి మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

బిందు శనివారం రాత్రి మృతి చెందగా.. ఉన్ని కృష్ణ పిళ్లై ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కుమార్తె ప్రేమ వ్యవహారం పట్ల ఆ దంపతులు మానసికంగా కుంగిపోయారని, ఎంత నచ్చజెప్పినా వినకుండా ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బంధువులు చెప్పారని పోలీసులు వెల్లడించారు.