Crime: రెండు వర్గాల మధ్య గొడవ.. ఐదుగురిపై లారీ ఎక్కించి హత్య..

Crime: Fight between two groups.. Five people were killed by a lorry
Crime: Fight between two groups.. Five people were killed by a lorry

రాజస్థాన్లోని ఝాలావాఢ్లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరులు సహా ఐదుగురిపై లారీ ఎక్కించి హత్య చేశారు. ఓ వివాదంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

శనివారం అర్ధరాత్రి బిన్యాగా గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్ద వివాదంగా మారింది. దీంతో ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు తుఫాన్ సింగ్, గోవర్ధన్ సింగ్, భరత్ సింగ్, ధీరజ్ సింగ్, బాలు సింగ్లు పగారియా పోలీస్ స్టేషన్కు రెండు బైక్లపై వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లారీతో వచ్చి ఆ ఐదుగురు వ్యక్తులపైకి ఎక్కించారు. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్య క్తి మరణించారు. మృతుల్లో భరత్ సింగ్, ధీరజ్ సింగ్లు అన్నదమ్ములు.