బీహార్‌లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహిళలను గర్భం దాల్చడం కోసం పురుషులకు 13 లక్షల రూపాయల వరకు జాబ్ స్కామ్‌లో బీహార్ పోలీసులు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, ఈ గ్రూప్ వివిధ సోషల్ మీడియా వేదికగా ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’గా వర్క్ చేస్తుంది.. ఉద్యోగ సేవలో పాల్గొనమని పురుషులను ఎర వేసింది. ఆసక్తిగల అభ్యర్థులు తొలుత 799 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
ఇక, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అమాయక ప్రజలే టార్గెట్ గా ఈ కేటుగాళ్లు పని చేస్తున్నారు. వారు తెలిసిన వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయిన తర్వాత వాళ్లకి అమ్మాయిల ఫోటోలు సైతం పంపేవారు. అమ్మాయిని ఎంపిక చేసుకున్న తర్వాత బాధితుడి నుంచి దాదాపు 5 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పూర్తి సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాలని ఈ ముఠా కోరేది.. అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత ప్రైజ్ మనీ (లక్షల్లో)ల్లోచెల్లిస్తానని కూడా ఈ బృందం బాధితులకు చెప్పేది. ఈ మొత్తం నగదు చెల్లింపులు చేసిన తర్వాత ఈ ముఠా పరార్ అయ్యేది.. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీనిపై బీహార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి మున్నా కుమార్ వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడికి సంబంధం ఉన్న పలు ప్రాంతాలపై దాడులు చేసిన తర్వాత ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు అని డీఎస్పీ కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. అయితే, అరెస్టైన వ్యక్తులు దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద సైబర్ క్రైమ్ సిండికేట్‌లో భాగమని చెప్పారు. ఈ దాడుల్లో తొమ్మిది స్మార్ట్ఫోన్లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.