నూతన సంవత్సర వేడుకల వేళ.. షాపింగ్ మాల్లో ఫొటోషూట్‌కు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. సుధామనగర్కు చెందిన ఓ యువతి (21) ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం బీబీఏ చదువుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మాల్లో ఫొటోషూట్ చేయాలనుకొంది. ఇందుకు తల్లిదండ్రులను అనుమతి కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. మరుసటి రోజు గదిలో తమ కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె గదిని పరిశీలించిన వారు అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్‌ను గుర్తించలేదు. దీంతో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.