పార్ట్‌టైం జాబ్ పేరిట టాస్కులు చేస్తే డబ్బులిస్తామంటూ చెప్పిన మాటలు నమ్మి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.31 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలక పట్టణ పరిధి నవ్య నగర్ కాలనీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఫోన్‌కు గతనెల 26న ఆన్లైన్లో పార్ట్‌టైం జాబ్ అంటూ వచ్చిన లింకును క్లిక్ చేశాడు. దానిలో టాస్క్ లు ఇచ్చారు.
టాస్క్ లు పూర్తి చేయాలంటే ఫీజు చెల్లించాలనడంతో రూ.2 వేలు కట్టాడు. కమీషన్ ఇచ్చి మళ్లీ కట్టమన్నారు. అలా రూ.31 లక్షలు కట్టాడు. తర్వాత స్పందన లేకపోవడంతో పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.