ప్రేమించిన యువతిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిషబ్ నిగమ్-వందన మధ్య పదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రస్తుతం ఆమె పుణెలోని హింజావాడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే వందన కొంతకాలంగా అతడికి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో రిషబ్ మనస్తాపానికి గురయ్యాడు. ఆమెపై అనుమానం పెంచుకొని.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్రియురాలిని కలిసేందుకు పుణెకు వచ్చిన అతడు ఓ హోటల్లో గదిని బుక్ చేశాడు. అక్కడకి వెళ్లిన వందనను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముంబయికి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.