హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని చిక్కడపల్లి ఎస్ఎస్ఆర్ గర్ల్స్ హాస్టల్లో శిరీష అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఇక ఈ సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
మృతురాలు శిరీష మహబూబాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు పోలీసులు. మానసిక ఒత్తిడి లేక ప్రేమ విఫలం కారణంగా యువతి సూసైడ్ పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు చిక్కడపల్లి పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.