బెట్టింగ్ సెంటర్ నంద్యాల

crores are betting going on in nandyal by elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల ఉపఎన్నికల పోరు ఎంత ప్రతిష్ఠాత్మకమే వేరే చెప్పక్కర్లేదు. టీడీపీ, వైసీపీ రాజకీయ భవిష్యత్ ను ఈ ఉపఎన్నికలే నిర్దేశించబోతున్నాయి. అందుకే ప్రధాన పార్టీలు ఉపఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఉపఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ కనిపిస్తోంది.

టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ, వైసీపీ నుంచి శిల్పా ఫ్యామిలీ బరిలోకి దిగడంతో.. చిరకాల ప్రత్యర్థుల సమరం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ వాళ్లే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పందెంరాయుళ్లు నంద్యాలలో దిగారు. నంద్యాల పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి రోజూ మొగ్గు ఎవరివైపు ఉందో అని కొలిచేసుకుంటున్నారు.

ఇప్పటికే రాజకీయ నేతల దెబ్బకు నంద్యాల హోటళ్లన్నీ ఫుల్లయ్యాయి. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు కూడా దిగడంతో పరిస్థితి ఇంకా టైట్ అయిపోయింది. లాడ్జిలే కాదు డిమాండ్ దెబ్బకు పెద్దఇళ్లు ఉన్న వాళ్లు కూడా తమ ఇళ్లలో ఓ రూమ్ అద్దెకిచ్చేలా టెంప్ట్ అవుతున్నారు. నంద్యాలలో ఎవరు గెలిచినా కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరుగుతుందని తేలడంతో… ఐటీ అధికారులు కూడా నంద్యాలలో దిగారు.

మరిన్ని వార్తలు:

చైనా త్రిముఖ యుద్ధ వ్యూహం

సెహ్వాగ్ పై నెటిజ‌న్ల మండిపాటు