చిరంజీవి ఇంటివద్ద ఉద్రిక్తత… భారీగా చేరిన అభిమానులు

చిరంజీవి ఇంటివద్ద ఉద్రిక్తత... భారీగా చేరిన అభిమానులు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ నాయకులు చిరంజీవి నివాసం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మెగాస్టార్ ఇంటి ముందు భారీ భద్రతని ఏర్పాటు చేసారు. చిరంజీవి ఇంటి చుట్టూ ..పెద్ద పెద్ద భారీ కేడ్లు ఏర్పాటు చేసారు. అయన ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎవరినీ పంపడం లేదు. అయితే అమరావతి పరీరక్షణ జేఏసీ మాత్రం చిరు ఇంటి ఎదుట జరుగుతున్న ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లోని చిరంజీవి ఇంటి ముందు నేడు ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం.ల వరకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు అమరావతి యువసేన జేఏసీ ముందుగా ప్రకటించింది. ఈ దీక్ష అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలని చిరంజీవిని మర్యాదపూర్వకంగా కోరడానికి మాత్రమేనని ఎలాంటి ఆందోళనలకు కాదని జేఏసీ తెలిపింది.
ఏపీలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిన ..మూడు రాజధానులకి చిరంజీవి మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అంతేకాదు మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి కోరారు. అధికార పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అని సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేలా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఉన్నాయని ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే.. ఆర్థిక సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని మరోసారి అలా జరగకుండా ఉండాలంటే మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యం లో మెగాస్టార్ అభిమానులు కూడా అయన ఇంటి వద్దకి భారీగా చేరుకుంటున్నారు.