ప్రభాస్ మూవీ లో నటించబోతున్న ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు?

ప్రభాస్ మూవీ లో నటించబోతున్న ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సినిమా అంటూ ప్రకటన వెలువడగానే మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ సినిమా ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయిేత ఈ సినిమాలోని నటీనటుల గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొంటున్నది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

ప్రభాస్‌తో రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ కోసం క్రేజీ హీరోయిన్ల పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం అందాల భామ దీపిక పదుకోన్‌ను సంప్రదించారనే వార్త మీడియా సర్కిళ్లలో గుప్పుమంటున్నది. ఈ కథలో పాత్ర తీరుతెన్నులను కూడా దీపికకు వివరించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్న ప్రియాంకతో నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది
.
ప్రభాస్ మూవీలో దీపికా పదుకోన్ నటించడానికి ఇష్టపడకపోతే ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాతో సంప్రదింపులు జరుపాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. దక్షిణాది చిత్రాలకు ఈ ఇద్దరు హీరోయిన్లు ఓటేస్తారా? అనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.