పవర్ స్టార్ మూవీ “ఫస్ట్ లుక్ ” వచ్చేస్తుంది.

పవర్ స్టార్ మూవీ

పవన్ ని ఫ్యాన్స్ వెండి తెరపై చూసి రెండేళ్లు అవుతుంది. దీనితో వాళ్ళు ఆయన కొత్త చిత్రాల అప్డేట్స్ కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. వచ్చే నెల 2వ తారీఖున పవన్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ వచ్చే అవకాశం కలదని ప్రచారం జరుగుతుంది. లేదంటే మార్చి 8న ఉమెన్స్ డే కానుకగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రావచ్చట.అయితే టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సినిమాకు లాయర్ సాబ్, లేదా వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది.

అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అదే పాత్రను పవన్ పోషిస్తున్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. పవన్ మొదటిసారి లాయర్ రోల్ చేస్తుండగా మేలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు