విలన్ గా మారిన “కమెడియన్ “

విలన్ గా మారిన

పలు చిత్రాల్లో కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించిన సునీల్ మద్యలో హీరోగా మారారు .తర్వాత మళ్ళీ కమెడియన్ గా మారారు .కమెడియన్ గా నటించటమే కాకుండా ..ఇటీవల విడుదలైన డిస్కోరాజా చిత్రం లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే .ఇప్పుడు సునీల్ మరో సినిమాలో విలన్ గా నటించబోతున్నారు .ఆ సినిమాయే “కలర్ ఫోటో “.

ఈ రోజు (ఫిబ్రవరి 28) సునీల్ పుట్టిన రోజు సందర్భంగా ”కలర్ ఫోటో” సినిమా నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటిస్తున్నాడని, ఆయన పాత్ర పేరు రామరాజు అని తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

అయితే తాజాగా ఆ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన సునీల్.. తన స్పందన తెలియజేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. ”ఇప్పటివరకు నా కెరీర్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ రామరాజు. ఈ డిఫెరెంట్ లో నన్ను చూసి ఆడియన్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతారు. నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కలర్ ఫోటో చిత్ర యూనిట్‌కి కృతజ్ఞతలు” అని పేర్కొన్నాడు సునీల్.