నడుస్తోన్న కాలం అత్యాధునిక యుగం. ఈ కాలంలో ప్రతి వ్యక్తీ స్మార్ట్ ఫోన్ లు ఉపయోగించేస్తున్నారు. ఈ స్మార్ట్ వినియోగం పెరిగిన తర్వాత రకరకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క క్లిక్‌తో గేమ్స్, వీడియో కాన్ఫరెన్స్, చాటింగ్స్, మూవీస్, ఇలా ఎన్నో చూడవచ్చు. అలాగే చాలావరకూ సోషల్ యాప్స్ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే కొన్ని యాప్స్ నుంచి యూజర్స్ డేటా చోరీ అవుతుండటం నిత్యం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. గ్లోబలైజేషన్ నేపథ్యంలో డేటా కూడా పెద్ద మార్కెట్‌గా అవతరించింది. దీంతో అడ్డదారుల్లో డేటాను చోరీ చేసి అమ్మే సైబర్ నేరగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా ట్రూకాలర్ డేటా పేరిట ఓ సైబర్ నేరగాడు 4.75కోట్ల మంది భారతీయుల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన వారిని ఆన్లైన్ ఇంటలిజెన్స్ సంస్థ సైబిల్ గుర్తించింది. ఇందులో స్త్రీ, పురుషుల పేర్లు, వారి ఫోన్ నంబర్స్, వారి లొకేషన్, మొబైల్ నెట్వర్క్, ఫేస్ బుక్ ఐడీ, మెయిల్ వంటి వివరాలు అన్నీ ఉండటంతో అధికారులు షాక్ కు గురౌతున్నారు. అలాగే.. 2019 నుంచి యూజర్ డేటాను అతను చోరీ చేసినట్టు తేలింది.