న్యూయార్క్‌లో తుపాను బీభత్సం

న్యూయార్క్‌లో తుపాను బీభత్సం

న్యూయార్క్‌లో ఐడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను బీభత్సానికి ఏడుగురు మృతి చెందారు. న్యూయార్క్‌లో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు విమానాలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ఇడా తుపానుతో అమెరికాలోని న్యూయార్క్‌లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్‌పాస్‌ వంతెనలు, రైల్వే స్టేషన్లు సబ్‌వేల్లోకి భారీగా నీరు చేరింది.

రహదారుపై వరద పొంగిపొర్లుతోంది. అనేక ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి మోకాలిలోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో రవాణాను నిలిపివేశారు. తుపాను కారణంగా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ కేటీ హోచుల్‌ తెలిపారు. అటు పొరుగున ఉన్న న్యూజెర్సీలో కూడా అత్యవసర స్థితిని ప్రకటించారు.