స్టాక్ మార్కెట్‌ని ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ విజృంభనతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత్తి, లాక్‌డౌన్ భయాలు మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఫలితంగా గత వారం మార్కెట్ నష్టాలతో ముగియగా.. ఈ సోమవారం ఉదయం సెషన్ ప్రారంభం కావడంతోనే నష్టాలు చుట్టు ముట్టాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో తమ లాభాల స్వీకరణకు ఉపక్రమించారు. ఫలితంగా ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు భారీ స్థాయిలో పాయింట్లు కోల్పోతున్నాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 57,028 పాయింట్లతో ఓపెన్ అయ్యింది. ఈ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు పోటెత్తడంతో కేవలం ఇరవై నిమిషాల్లోనే దాదాపు 500 పాయింట్లు సెనెక్స్ కోల్పోయింది. ఆ తర్వాత అనూహ్యంగా నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ కోలుకుందిజ ఉదయం 9:20 గంటల సమయంలో 80 పాయింట్లు నష్టపోయి 57,080 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయి 16,827 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.