టాలీవుడ్ లో లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన సినిమా ల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో తెరకెక్కించిన సాలిడ్ మాస్ సినిమా “డాకు మహారాజ్” కూడా ఒకటి. మొదటి షోతోనే సాలిడ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది. మరి తన నుంచి హైయెస్ట్ గ్రాసర్ గా మారిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఇపుడు నెమ్మదిస్తుంది.
వీకెండ్ కి వచ్చినప్పటికీ కూడా డాకు మహారాజ్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే హిందీలో కూడా మేకర్స్ రిలీజ్ కి తీసుకొచ్చారు కానీ అక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేనట్టే తెలుస్తోంది . ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా కొంచెం ప్రమోషన్స్ లాంటివి చేసుంటే బాగుండు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. దీనితో డాకు మహారాజ్ ఫైనల్ రన్ ఎక్కడ వరకి వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.