“డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రాబోతుంది!”

"Daku Maharaj's first single is coming!"
"Daku Maharaj's first single is coming!"

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ మూవీ “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్సంతా ఎప్పుడు నుంచో చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ తో ఉన్న సంక్రాంతి మూవీ లు నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్స్ వచ్చేసాయి కానీ ఈ సినిమా కి మాత్రం రాలేదు. మరి ఫైనల్ గా మేకర్స్ దీని డేట్ అయితే ఇచ్చేసారు.

"Daku Maharaj's first single is coming!"
“Daku Maharaj’s first single is coming!”

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సాంగ్ ను మేకర్స్ డిసెంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. అలాగే ఇదొక పవర్ఫుల్ ట్రాక్ అంటూ కూడా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోను రేపు డిసెంబర్ 13 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి వదలబోతున్నట్టుగా తెలిపారు. మరి బాలయ్యకి థమన్ ఎలాంటి సంగీతం అందించాడో తెలిసిందే. దీనితో డాకు మహారాజ్ ఆల్బమ్ పై కూడా సాలిడ్ హైప్ ఉంది. మరి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అనేది చూడాలి.