మూసీ నదిలో మృతదేహం

మూసీ నదిలో మృతదేహం

మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్‌పేట ముసారాంబాగ్‌ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది.

ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్‌కేసర్‌ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.