హిందూ శ్మశానంలో ముస్లిం వ్యక్తి మృతదేహం ఖననం.. ఆపై

కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు.....

తెలంగాణలోని హైదరాబాద్ లో మానవత్వం పరిమళించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఖాజా మియా అనే వ్యక్తి ఈ మధ్య  గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. అయితే లాక్‌డౌన్ వేళలో సొంతూరు తీసుకెళ్లడం కుదరక పోవడంతో.. అతడి సంబంధికులు హైదరాబాద్‌లోనే ఖాజామియా మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని ఆలోచించారు. కానీ ఖాజా మియాకు కరోనా వైరస్ సోకి ఉంటుందనే.. అనుమానంతో ముస్లిం శ్మశాన వాటికల్లో ఖననం చేయడానికి ముత్వాలీలు అనుమతి ఇవ్వలేదు. ఆరు శ్మశాన వాటికలకు మృతదేహాన్ని తీసుకెళ్లినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో సందీప్, శేఖర్ అనే ఇద్దరు యువకుల చొరవతో హిందూ శ్మశాన వాటికలో ఖాజా మియా భౌతిక కాయాన్ని పూడ్చి పెట్టారు.

అయితే ఆనోటా ఈనోటా ఈ విషయం ముస్లి పెద్దల దృష్టికి వెళ్లడంతో ఖాజామియా మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి అనుమతి ఇవ్వని ముత్వాలీలకు వక్ఫ్ బోర్డ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికలు ఒప్పుకోక పోవడంతో ప్రత్యేకంగా కరోనా పేషెంట్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం బాలాపూర్ సమీపంలో ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. కాగా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ.. ఇన్ఫెక్షన్ బారినపడి చనిపోయిన వారి పట్ల అమానవీయంగా వ్యవహరించ వద్దని మజ్లిస్ పార్టీ సూచించడం గమనార్హం.