అయితే పెరంబువూరులోని ఓ బ్యాంకులోకి వెళ్లిన బీనా పౌల్ అనే యుతివి అక్కడి ఉద్యోగం చేస్తుంది. ఏదో డాక్యుమెంట్ కావాలని అడిగేసరికి.. వేగంగా, బయట ఉన్న తన కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె తలుపుగా ఉన్న అద్దాన్ని గమనించలేదు. కాగా బీనా పౌల్ ప్రమాదవశాత్తూ.. ఆ అద్దాన్ని బలంగా ఢీకొట్టగా.. అది ఆమె కడుపులో గుచ్చికొని గాయాల పాలైంది. వెంటనే ఆమె కుప్పకూలిపోయింది. కాగా ఆమె తలకు కూడా గాయమైంది. గ్లాస్ డోర్ కు తగిలి కిందపడిన తర్వాత, లేచిన ఆమె, తన కడుపును పట్టుకుని విలవిల్లాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతర్గత గాయాల కారణంగానే బీనా మరణించారని పెరంబవూరు పోలీసు అధికారి సి.జయకుమార్ తెలిపారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్యాంకులో ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నారని.. వారు ఆమెకు సాయం చేయడానికి ప్రయత్నించారు. వెంటనే బీనాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు గానీ.. ఆమె ప్రాణాలను కాపాడుకోలేకపోయామని ఉద్యోగులు చెప్పినట్లు పోలీసులు అధికారులు వివరించారు.