ఇంట్రెసింగ్ కాన్సెప్ట్ తో ‘డెకాయిట్’ టీజర్

ఇంట్రెసింగ్ కాన్సెప్ట్ తో ‘డెకాయిట్’ టీజర్
Cinema News

యువ నటుడు అడివిశేష్, అందాల కథానాయిక శృతి హాసన్ ల కలయికలో నూతన దర్శకుడు షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు, హిందీ బైలింగువల్ సినిమా డెకాయిట్. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ఇంట్రెసింగ్ కాన్సెప్ట్ తో  ‘డెకాయిట్’ టీజర్
Decoyit

ఇక ఈ టీజర్ లో అడివి శేష్, శృతి హాసన్ ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్స్ లో కనిపించి అలరించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆకట్టుకునే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సాగిన డెకాయిట్ టీజర్ ప్రస్తుతం అందరినీ అలరిస్తూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. కాగా ఈ సినిమా ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.

మీరు కూడా ఈ వీడియో ని క్లిక్ చేయండి