హిందీ పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లేటెస్ట్ సీజన్లో బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ తన యాంకరింగ్‌తో అభిమానులకు ఆకట్టుకుంటున్నారు. గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ సెస్సేషన్‌గా నిలవనుంది. హాట్‌లోసీట్‌లో ఉన్న అమితాబ్‌కు భర్త రణవీర్ సింగ్‌పై దీపికా ఫిర్యాదు చేయడం, ఈ సందర్భంగా దీపికా దంపతులతో బిగ్‌బీ చేసిన సందడి హైలెట్‌గా నిలిచింది.
ఈ కార్యక్రమంపై ప్రోమోల మీద ప్రోమోలను విడుదల చేసింది సోనీ టీవీ. లేటెస్ట్ ప్రోమోలో తన భర్త రణ్వీర్ సింగ్ ఫిర్యాదు చేసింది దీపిక. బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడతానని ప్రామిస్ చేసిన రణవీర్ ఇంతవరకు ఆ పనిచేయలేదంటూ గోముగా ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రణవీర్‌ను లైన్లోకి తీసుకొచ్చి అమితాబ్ ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా వంట చేయలేదటగా అంటూ మరింత క్రేజ్ పెంచారు. దీంతో అమితాబ్ జీకి నా విషెస్ చెప్పమంటే.. నామీదే కంప్లైంట్ చేస్తావా అంటూ రణవీర్ అలిగాడు.
చివరలో తన ఒడిలో కూర్చొ బెట్టుకుని ఆమ్లెట్ తినిపించమని అమితాబ్ చెప్పారంటూ ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడు రణవీర్.పండుగ సందర్భంగా స్పెషల్ ఎడిషన్‌తో సందడి చేసే షో నిర్వాహకులు తాజాగా దీపికా, ఫరా ఖాన్‌ను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫరా, దీపికా అల్లరితోపాటు, కొన్ని ఎమోషనల్ సంగతులను కూడా ప్రేక్షకులకు వడ్డించనున్నారు. దీంతోపాటు ఇండియన్ ఐడల్ సింగర్స్ తమ పాటలతో చేసిన సందడి షోకు మరింత ఎట్రాక్షన్‌గా నిలనుంది.