గుడ్ న్యూస్ : “కల్కి” మూవీ కి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకునే!

Deepika Padukone completes dubbing for
Deepika Padukone completes dubbing for "Kalki" movie!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి (Kalki2898AD). జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ లో దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తన పార్ట్ డబ్బింగ్ ని దీపికా పదుకునే పూర్తి చేసినట్లు తెలుస్తుంది. హిందీ మరియు కన్నడ భాషల్లో డబ్బింగ్ ని చెప్పినట్లు సమాచారం.

Deepika Padukone completes dubbing for "Kalki" movie!
Deepika Padukone completes dubbing for “Kalki” movie!

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రల ల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.