బాలీవుడ్లో స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రణవీర్ సింగ్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యాడు. ఈ షోలో బాగంగా ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. గతంలో తాను ఓ షూటింగ్ సెట్ నుండి గెంటి వేయబడినట్టుగా చెప్పుకొచ్చాడు. అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటిస్తున్న సినిమా షూట్‌ను తన పాటికి తాను ఎవరిని డిస్ట్రబ్ చేయకుండా చూస్తుండగా చిత్ర యూనిట్ సభ్యలు వచ్చి తనని గెంటేశారని చెప్పుకొచ్చాడు.
షూటింగ్ ఇబ్బంది అని తనని పంపిచండంతో చాలా బాద పడ్డానని, నా వల్ల షూట్‌కు ఏం ఇబ్బంది అని పీల్ అయ్యినట్టు రణవీర్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఏదో ఒక కారణం లేనిదే అలా చేయరు కానీ నన్ను అలా ఒక వ్యక్తి పట్టుకుని బయటకు పంపిచడం చాలా కష్టమనిపించింది అని రణవీర్ చెప్పుకొచ్చాడు.రణవీర్‌ను గెంటేసిన విషయం గురించి ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన రవీనా టాండన్ క్లారిటీ ఇచ్చింది. రణవీర్ ఉన్న సమయంలో తాను అక్షయ్ కుమార్‌తో కలిసి వర్షంలో తడుస్తూ ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి ఉంది.
అయితే చిన్న పిల్లాడు అయిన రణవీర్ అక్కడ ఉంటే అది చూసి చెడిపోతారనే ఉద్దేశ్యంతోనే రణవీర్‌ని బయటకు పంపించారు తప్పితే అందులో మరే కారణం లేదు. వాస్తవానికి అలాంటి రొమాంటిక్ సీన్లు చిన్న పిల్లల ముందు షూట్ చేయడం అంత మంచిది కాదు అందుకే రణవీర్‌ను బయటకు పంపించారు అని రవీనా క్లారిటీ ఇచ్చింది. రణవీర్ త్వరలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకునేను వివాహం చేసుకోనున్నాడు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.