కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. మే 15 ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్‌లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ “ఆపరేషన్ సిందూర్” తర్వాత రాజ్‌నాథ్ సింగ్ కాశ్మీర్ లోయకు చేసిన మొదటి పర్యటన ఇది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

