దేశమంతా కరోనా.. కరోనా.. కరోనా.. ఒకటే మాట. తాజాగా ఢిల్లీలోని ఒక మొహల్లా కమ్యూనిటీ క్లినిక్ లో ఒక వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 10న సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన ఒక మహిళ కారణంగా అతడికి సంభవించినట్లు సమాచారం అందుతుంది. ఆ మహిళ కోవిద్-19 లక్షణాలతో క్లినిక్‌ను వచ్చిందని తెలుస్తోంది.
అయితే ఆమె వచ్చి వెళ్లిన తర్వాత ఆ డాక్టర్ ని వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన 900 మందిని క్వారంటైన్లో నిర్బంధించినట్లు ఢిల్లి మినిస్టర్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ -19 కేసుల సంఖ్య ఇప్పుడు 36 గా ఉందని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా డాక్టర్ భార్య.. కుమార్తెకు బుధవారం వైరస్ పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. వైరెస్ సోకిన మహిళతో ప్రత్యక్ష సంబంధం ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు నుండి వైరస్ పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. ఆమె తల్లి, సోదరుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె రాగానే ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఆమెను తీసుకువెళ్ళిన బంధువు, ఆమె పరిసరాల్లోని 74 మంది వ్యక్తులు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ కేసుతో సంబంధం లేకుండా మొహల్లా క్లినిక్‌లు తెరిచి ఉంటాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా పేదలకు అందుబాటులో ఉన్న ఈ ఆసుపత్రి తెరిచే ఉంటాయని వీటిని మూసి వేస్తే పేదలు ఖరీదైన ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని.. వారికి భారం కానుందని సీఎం కేజ్రివాల్ వివరించారు.