ప్రపంచాన్ని వేధిస్తోన్న వైరస్ కరోనా. అయితే ఇప్పుడు మనవాళ్లు కరోనా రాకుండా ఉండాలంటే ఏం తినాలి… ఏం తాగాలి అనే పనిలే ఉన్నారు. ముఖ్యంగా తాటి కల్లు తాగితే కరోనా రాదని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం.. ఉండి నియోజక వర్గాల్లో ఉన్న మద్యం ప్రియులు తాటికల్లు కోసం ఎగబడుతున్నారు.అదేవిధంగా ఆకివీడు మండలం కుప్పనపూడి మండలంలో ఒక లీటర్ తాటికల్లు గతంలో ముప్పై రూపాయలు ఉంటే.. ప్రస్తుతం తాటి కల్లుకు డిమాండ్ పెరగడంతో రూ.100 రూపాయల నుంచి రూ.150 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రేటు ఎంతైనా పర్వాలేదు కానీ తనకు కల్లు కావాలంటూ మద్యం ప్రియులు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బాటిల్స్ లతో, బిందెలతో తాటికల్లు నింపుకొని తీసుకువెళ్తున్నారు. మొత్తం మీద కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కల్లుగీత కార్మికులు.