Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రాచీన భారతీయ సాహిత్యానికి గర్వకారణంగా ఉన్న కామసూత్ర గ్రంథాన్ని నిషేధించాలన్న డిమాండ్ మన దేశపు గడ్డమీదే పుట్టుకురావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. శృంగారానికి ప్రపంచంలోనే తిరుగులేని పుస్తకం కామసూత్ర అని ప్రపంచమంతా ఏకగ్రీవంగా అంగీకరించింది. అలాంటిది ఖజురహో ఆలయం దగ్గర ఈ పుస్తకాలు అమ్మడం కారణంగా దేశం పరువు పోతోందని వీర హిందుత్వ వాదులు కొత్తగా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.
ఖుజరహో శిల్పాలు పైకి చూస్తే నగ్నశిల్పాలే. కానీ లోతుల్లోకి వెళ్లి చూస్తే.. శిల్పాల వెనుక మనిషి పరిణామ క్రమాన్ని కళ్లకు కట్టారు శిల్పులు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఖజురహో ఆలయాలు మన దేశానికే గర్వకారణం. అలాంటి చోట ఆ శిల్పాలను మరింత వివరించే విధంగా ఉండే కామసూత్ర పుస్తకాలు ఎక్కువగా అమ్మడం ఎప్పట్నుంచో జరుగుతోంది. శిల్పాలు చూసి, పుస్తకం చదివితే మరింత అర్థం చేసుకోవచ్చన్నది టూరిస్టుల భావన కూడా.
కానీ నయా హిందుత్వవాదులకు ఇది కూడా తప్పైపోయింది. నెమళ్లు శృంగారం చేయవని, గోవు ఆక్సిజన్ వదులుతుందని కొత్త సిద్ధాంతాలు చెబుతున్న వీళ్లు.. చివరకు వాత్సాయనుకుడికి కూడా మురికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చి ముదిరింది రోకలికి కట్టండన్నట్లుగా వీళ్లు తయారయ్యారని విమర్శకులు మండిపడుతున్నారు. ఎప్పుడో క్రీస్తుపూర్వంలో రచించిన గ్రంథంతో.. ఇప్పుడే దేశానికి పరువు తక్కువేంటని ప్రశ్నిస్తున్నారు.