అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా చెప్పారు. గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్టు సదరు కాగ్ రిపోర్టులో వెల్లడైంది.