సింహాచలం ఘటనపై డిప్యూటీ సీఎం & లోకేష్ దిగ్భ్రాంతి..

Pawan Kalyan's visit to Visakhapatnam today..!
Pawan Kalyan's visit to Visakhapatnam today..!

సింహాచలంలో గోడ కూలడం కారణంగా క్యూ లైన్‌లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చందనోత్సవ వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. అలాగే…రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.