డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు

AP politics: Yuvagalam @ 226 days.. mother, aunt in Lokesh padayatra
AP politics: Yuvagalam @ 226 days.. mother, aunt in Lokesh padayatra

రాష్ట్రానికి కుంకీ ఏనుగులు రావడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.