సినిమా థియేటర్‌లో గ్రామస్తులతో పవన్ ముఖాముఖీ

Do you know how much Pawan Kalyan has earned in the last five years..!
Do you know how much Pawan Kalyan has earned in the last five years..!

ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వెండి తెర ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రజలతో ఆయన ముఖా ముఖీ నిర్వహించారు. మన ఊరు – మాటామంతి కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని రావివలస గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను ఆన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వెండి తెరను.. ప్రజల వేదన తీర్చే సాధనంగా మార్చారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.