
తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అందుకోసం రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణను రైల్వే శాఖ చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పూర్తయింది.