విశాఖపట్నంలో నేడు జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం.. అందుకు పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరు కారణం కావడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ ఎన్నికకు గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశించారు. కొందరిపై చర్యలకు వెనకాడ వద్దని ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ఆయన కీలక సూచన చేశారు. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.





