దేవరకొండ నయా ప్లాన్…వర్కౌట్ అయ్యేనా ?

devarakonda new plan

విజయ్ దేవరకొండ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తన సినిమాలు పెద్దపెద్ద బ్యానర్స్ తో చేస్తున్న విజయ్ తన సొంత ప్రొడక్షన్ అయినా `కింగ్ ఆఫ్ ది హిల్స్‌` అనే ఓ సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించాడు. అయితే ఇప్పటివరకు ఇందులో తన సొంత సినిమాలు చేయలేదు విజయ్. అయితే సడన్ గా మాత్రం ప్లాన్ మార్చేశాడు. ఇకపై తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గ ప్లాన్ కూడా వేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇవి గీత గోవిందంకి ముందు, పెళ్లి చూపులు తర్వాత ఒప్పుకున్నవే. అందుకే ఇవి ముందు కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇవి పూర్తయ్యే సరికి 2020 వరకూ పడుతుంది. ఆ త‌ర‌వాత‌… సొంత బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేయ‌బోతున్నాడ‌ట‌. ఒకవేళ పెద్ద సంస్థలు వస్తే…త‌న పారితోషికాన్ని మిన‌హాయించుకుని, వాటా దారుడిగా చేయ‌బోతున్నాడ‌ట‌. ప్రస్తుతం విజయ్ బ్యానర్ లో తన మొదటి హిట్ సినిమా ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా రాబోతుంది.