Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Devi Dayal Agarval Shocked Election Commission
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్ తెరపైకి వచ్చారు. కానీ వీరిద్దరే కాకుండా చాలా మంది నామినేషన్లు వేసినా.. వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. అందులో ఓ నామినేషన్ చూసి ఈసీ అధికారులు కూడా అవాక్కయ్యారు. నేను దేవుడ్ని నన్ను రాష్ట్రపతిని చేయండని ఓ అభ్యర్థి చెప్పుకోవడం అందరికీ షాకిచ్చింది.
హరియాణా పానిపట్ కు చెందిన దేవి దయాళ్ అగర్వాల్ నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. ఆయన నామినేషన్ లో తనను తాను 24 సార్లు దేవుడిగా సంబోధించుకున్నారు. పైగా కోవింద్, మీరా కుమార్ గెలవరని, తన విజయానికి ఎంపీలు, ఎమ్మెల్యేల బలం అక్కర్లేదని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. తనను రాష్ట్రపతి చేయకపోతే ఢిల్లీలో భూకంపం వస్తుందని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు.
అయితే ఇలాంటి నామినేషన్లు చాలా చూసిన అనుభవం ఉన్న అధికారులు దానిని డస్ట్ బిన్లో పడేశారు. ఎంపీల బలం కావాలని కానీ.. బెదిరింపులు, అతిశయోక్తులతో ఎవరూ రాష్ట్రపతి కాలేరని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దేశం అత్యాధునిక సాంకేతిక యుగంలో ముందుకెళ్తున్నా.. ఇంకా ఇలాంటి ఛాందసులు ఉన్నారని రాష్ట్రపతి ఎన్నికల సాక్షిగా రుజువైంది.