వైరల్ అయిన ధోనీ గ్లౌజ్ లు….ఎందుకో తెలుసా ?

dhoni glouces is viral

సౌత్ ఆఫ్రికా తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్ లో ధోనీ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను ధ‌రించిన గ్లౌజ్‌లు అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాయి. త‌న‌లో ఉన్న దేశ‌భ‌క్తిని మ‌రోసారి చాటాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ ముదురు ఆకుప‌చ్చ‌ క‌ల‌ర్‌లో ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించాడు. అయితే ఆ కీపింగ్ గ్లౌజ్‌ల‌పై ఓ చిహ్నం ఉంది. అది పారామిలిట‌రీ ద‌ళాల‌కు చెందిన గుర్తు. దాన్ని బ‌లిదాన్ బ్యాడ్జిగా పిలుస్తారు. 2011లో ధోనీకి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ర్యాంక్ ఇచ్చారు. ఆగ్రాలో అత‌ను ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. శిక్ష‌ణ స‌మ‌యంలో అయిదు ప్యారాచూట్ జంప్‌లు కూడా చేశాడు. బ‌లిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లౌజ్‌లు ధ‌రించిన ధోనీ అభిమానులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో వ‌న్డేలో ధోనీ 34 ర‌న్స్ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్‌ చేశాడు.