వ్యాఖ్యాతగా “కెప్టెన్ కూల్”

వ్యాఖ్యాతగా "కెప్టెన్ కూల్"

టీమిండియాత తొలి డే అండ్‌ నైట్‌ టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. నవంబర్‌ 22వ తేదీ నుంచి జరగబోతున్న ఈ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించే సన్నాహాలు బీసీసీఐ  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చేస్తుంది. నూతన  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంకా బ్రాడ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ యాజమాన్యాలు కలిసి భారత మాజీ కెప్టెన్లకు ఆహ్వానం అందించే ఏర్పాట్లు చేయనున్నారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లకి కూడా ప్రత్యేక ఆహ్వానాలు ఇవ్వనున్నారు.

డే అండ్‌ నైట్‌ టెస్టు ఆడటం ఇదే మొదటి సారి కాబట్టి భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను ఆహ్వానించి వారి అనుభవాలను పంచుకునే అవకాశం ఇవ్వనుంది. డే అండ్‌ నైట్‌ టెస్టుకి కామెంటర్‌గా మాజీ కెప్టెన్‌ ధోనీ ఉండబోనున్నారని సమాచారం. బీసీసీఐ ధోని చేత కామెంటరీ చెప్పించే ప్రయత్నాలు చేస్తుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ అంగీకారం ఇస్తే మాజీకెప్టెన్‌ ధోనిని కామెంటరీ బాక్స్‌లో చూసే అవకాశం ప్రేక్షకులకి ఉండనుంది.

వరల్డ్‌ కప్‌ తర్వాత ఏ మ్యాచ్‌లో ఆడని ధోనీ వ్యాఖ్యాతగా వస్తే అతని అభిమానులు సంతోషపడే అవకాశం ఉంది. ఇంకా స్టార్‌ యాజమాన్యం ఆడియో కామెంటరీ ఏర్పాట్లను చూస్కుంటునది.