“స్వీటీ” కొత్త సినిమా టీజర్

అగ్ర కథానాయిక అనుష్క పుట్టినరోజు సందర్బంగా “నిశ్శబ్దం” సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందే ప్రీటీజర్ రిలీస్ అయ్యి ప్రేక్షకులని అలరించగ ఇపుడు ఆసక్తికరంగా ఈ సినిమా టీజర్‌ను రూపొందించారు.

అనుష్క దివ్యాంగురాలిగా కనిపించగా ఈ సినిమా సస్పెస్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో విహారయాత్ర పీడకలైందని పేర్కొన్నారు.ఈ సినిమాకు హేమంత్ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్‌ సరసన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న సినిమా ఇది

అరుందతి సినిమాతో ప్రఖ్యాత నటీమణిగా అనుష్క మంచి పేరు తెచ్చుకుంది.  కీలక పాత్రలలో షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. కోన వెంకట్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే ప్రయత్నాలలో సినిమా బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో “రెండు” పేరు ఖరారు చేశారు