పూర్తి లుక్ త్వ‌ర‌లో : అనుష్క‌

new look soon

ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అల‌రిస్తున్న అందాల భామ‌ అనుష్క. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సైలెన్స్ అనే చిత్రం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అమెరికాలో తొలి షెడ్యూల్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అనుష్క లుక్ ఎలా ఉంటుంద‌నే దానిపై అభిమానుల‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా, అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న లుక్‌ని కొద్దిగా రివీల్ చేసింది. పూర్తి లుక్‌ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని పేర్కొంది. ప్రీ లుక్‌లో అనుష్క షార్ట్ హెయిర్‌తో చేతిలో బుక్ ప‌ట్టుకొని రాస్తున్న‌ట్టుగా కనిపిస్తుంది. ‘త్వరలో స్పాట్‌లైన్‌లోకి వస్తాను’ అని స్వీటీ త‌న ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు .తమిళం, తెలుగు, హిందీ భాష‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మాధవన్‌ హీరోగా న‌టించ‌నుండ‌గా, అంజలి, షాలినిపాండే, అవ‌స‌రాల శ్రీనివాస్, సుబ్బ‌రాజు, హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తుంది. తెలుగులో ఈ చిత్రం నిశ‌బ్ధం పేరుతో విడుద‌ల కానుంది.