ధోనీ స‌రికొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

dhoni new world record

భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. సుధీర్ఘ‌కాలంగా అంత‌ర్జాతీయ క్రికెట్లో కొన‌సాగుతున్న మ‌హీ.. వికెట్‌ కీపర్‌గా ఏకంగా 350 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇందులో ధోనీ 3 మ్యాచ్‌ల్లో ఆసియా ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. మిగిలిన 347 టీమ్ ఇండియా తరఫున ఆడాడు. ఓవ‌రాల్‌గా 350 వ‌న్డేలాడిన ప‌దో క్రికెట‌ర్‌గా ధోనీ నిలిచాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిస్ట‌ర్‌కూల్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్(463) త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెట‌ర్ మ‌హీనే కావ‌డం విశేషం. మొత్తం 350 వ‌న్డేల్లో 200 మ్యాచ్‌ల‌కు ధోనీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఓవ‌రాల్‌గా రికార్డు స్థాయిలో వ‌న్డేల‌కు సార‌థ్యం వ‌హించిన మూడో క్రికెట‌ర్ ధోనీ కాగా భార‌త్ నుంచి ఏకైక ఆట‌గాడు మ‌హీనే కావ‌డం విశేషం.