ఈ రోజు మ‌ధ్యాహ్నం భార‌త్‌-కివీస్ సెమీస్ మ్యాచ్

today afternoon india newzeland semis match

మాంచెస్టర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జర‌గాల్సిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ నిన్న వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సంగ‌తి తెలిసిందే. ఏ దశలోనూ ఆటను కొనసాగించ‌డానికి వీలు లేని నేప‌థ్యంలో ఆట‌ను అంపైర్లు నేటికి వాయిదా వేశారు . నేడు రిజ‌ర్వ్ డే కావ‌డంతో మిగ‌తా ఆట‌ని కొన‌సాగించ‌నున్నారు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో వర్షం కురిసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసింది. దీంతో నేటి మ్యాచ్‌ను ఇక్క‌డ నుండి కొనసాగిస్తారు. ఈ క్రమంలో కివీస్ మరో 3.5 ఓవర్లు ఆడనుంది. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా 50 ఓవర్ల పాటు కొనసాగుతుంది. అయితే నేడు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోతే అప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నందున టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది..!