చిరు సార్‌ వల్లే బాధ్యత తెలిసొచ్చింది..?

Karthikeyan
Karthikeyan

ఆర్.ఎక్స్ 100.లో ఓ ఆటo బాంబులా పేలాడు కార్తికేయన్ నటుడిగా హీరోగా తనకంటూ ఓ మార్క్ వేసిన సినిమా అది అయితే ఆ తరవాత పరాజయాలు వెంటాడాయి. కానీ.. నటుడిగా తనని తాను నిరూపించుకొంటూనే ఉన్నాడు. ఇప్పుడు ‘బెదురులంక 2012’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతున్న సంధర్భంగా కార్తికేయ ముచ్చట్లు ఇవి.

‘‘2012లో అంటే యుగాంతం గురించి వచ్చిన వదంతులే నాకు గుర్తొస్తాయి. అప్పట్లో వాటి గురించి ఆసక్తికరంగా మాట్లాడుకొనేవాళ్లం. అదే కాన్పెప్టుపై ఇప్పుడు సినిమా చేశాం.బెదురులంక అనే ఓ ఊహనిజనితమైన గ్రామాన్ని కొన్ని, కొన్ని పాత్రల్ని సృష్టించి వాటి మధ్య నడిచే డ్రామాని తెరపైకి తీసుకొచ్చాం.

‘‘కరోనా సమయంలో క్లాక్స్‌ ఈ కథ చెప్పాడు.అప్పుడు కూడా యుగాంతం అయిపోతుందేమో అనే భయమే ఉండేది. కాబట్టి మరింతగా కనెక్ట్‌ అయ్యా. ఈమధ్య కాన్ఫిడెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకే ఫ్రెషకులు పెద్ద పీట వేస్తున్నారు‘‘ఇందులో నా పాత్ర పేరు శివ. దూకుడెక్కువ. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. తన గురించి ఎవరేం మాట్లాడినా పట్టించుకోడు. ఎవరి గురించీ ఆలోచించడు. ఈ క్యారెక్టరైజేషన్‌ నాకు బాగా నచ్చింది. నేహా శెట్టికి కూడా మంచి పాత్ర పడింది.

‘భగవద్గీతనీ, దేవుడ్నీ మనం అర్థం చేసుకొన్న విధానం వేరు. దేవుడి పేరుతో ప్రజల్ని భయపెట్టేవాళ్లు ఎక్కువైపోయారు. ఆ విధానాన్ని కొన్ని పాత్రల ద్వారా ప్రశ్నిస్తున్నాం. అంతేకాని ఏ ఒక్కరి మనోభావాలో కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు. సినిమా చూసినప్పుడు ఇవన్నీ నిజాలే కదా. అని ప్రశ్నకు కూడా అనిపిస్తుంది‘

‘మణిశర్మ గారు ఇది వరకు ఎన్నో సినిమాలకు పని చేశారు. కానీ ఈ జొనర్ లొ ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు.. అందుకే ‘నాకు ఇదే తొలి సినిమాలా అనిపిస్తోంది’ అన్నారు. ఈ కథని చాలా ఇష్టపడ్డారు. ఆ ఇష్టం పాటల్లో, నేపథ్య సంగీతంలో కనిపిస్తుంది‘‘

ఈమధ్య చిరంజీవిగారి గురించి కొంతమంది కొన్ని కామెంట్లు చేశారు. అవన్నీ తట్టుకోలేక ఓ ఇంటర్వ్యూలో స్పందించాను. చిరు సార్‌ని చూస్తూ పెరిగాను. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌. ఆయనే నా స్ఫూర్తి. నాకు అన్ని విషయాల్లోనూ బాధ్యత ఉంటుందో లేదో తెలీదు కానీ, సినిమా అనే సరికి.. అలర్ట్‌ అయిపోతాను. ఆ బాధ్యత చిరు సార్‌ వల్లే వచ్చింది. అందుకే ఆయన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోను. ఓ అభిమానిగా స్పందిస్తా’’.