టాలీవుడ్ డైరెక్టర్ అట్లీ గురించి పరిచయం చేయక్కర్లేదు. అట్లీ వరుస హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్నారు. ఈయన దర్శకత్వంలో మూవీ లు ఒక రేంజ్ లో ఉంటున్నాయి పైగా మూవీ లు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకి కూడా అట్లీ బాగా పరిచయమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ మూవీ పనిలో ఉన్నారు అట్లీ. జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ అట్లీ భార్య గురించి కూడా మాట్లాడారు. ఆమె పేరు ప్రియా అట్లీ.
సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తోంది ఇప్పుడు. అసలు పేరు కృష్ణ ప్రియా మోహన్. మొదట్లో ఈమె సీరియల్స్ చేసి, ఆకట్టుకుంది. తరవాత సింగం సినిమాలో అవకాశం వచ్చింది. ఆమె నటించిన మొదటి మూవీ. అనుష్క సోదరిగా నటించి ప్రియా మెప్పించింది. అలానే ఈమె రాజారాణి, నా పేరు శివ, తేరి సినిమాలు చేశారంట . తమిళ, మలయాళ సినిమాలలో కూడా ప్రియా నటించారు.