టాలీవుడ్ స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా మూవీ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘జాక్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ తో పాటు ‘తెలుసు కదా’, ‘కోహినూర్’ మూవీ ల ను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్‌కి సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
‘గీతా గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు పరశురామ్ పెట్లా ఇప్పుడు మరో సాలిడ్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఈ కథని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి వినిపించగా, ఆయన ఈ మూవీ ని చేసేందుకు ఓకే చెప్పారంట . ఇక ఈ మూవీ కథని సిద్ధు జొన్నలగడ్డకు కూడా పరశురామ్ వినిపించాడని.. కథ నచ్చడంతో సిద్ధు కూడా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి నిజంగానే ఈ డైరెక్టర్‌కి సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.. ఒకవేళ ఇస్తే ఈ మూవీ లో అతని పాత్ర ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.