ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ ని అణచి వేసేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ రెండో విడతను దిగ్విజయంగా ముగించుకొని మూడో దశలోకి అడుగుపెట్టాం. ఈనెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ 3.0 పొడగించారు. అయితే మద్యం విక్రయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో సోమవారం వేకువ జాము నుంచే దేశవ్యాప్తంగా బ్రాందీ షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. పురుషుల కంటే మేమేం తక్కువ అంటూ కొన్నిచోట్ల యువతులు, మహిళలు బ్రాందీ షాపుల ముందు బారులు తీరి నిలబడటం ఆశ్యర్యమేసింది.
అయితే బెంగళూరు నగరంలోని ఓ బ్రాందీ షాప్ ముందు క్యూలో నిలబడిన యువతి లిక్కర్ తాగక ముందే బీరు బాటిల్ చూసి కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో అసలు ఏం జరిగింది? అంటూ అక్కడున్న వారు, పోలీసులు ఆరా తీశారు. ఆ మహాతల్లి చెప్పిన సమాధానం విని మా తల్లే ఎంత త్యాగం చేశావ్? అన్నారు. యువతి చెప్పిన మాటలు విని మందుబాబులతో పాటు పోలీసులు షాక్ తిన్నారు. అసలు ఆమె ఏం చెప్పిందంటే.. దాదాపు నలభై రోజులుగా మద్యం లేదు. తిండి కూడా తినడం లేదు. దీంతో ఈరోజు సోమవారం షాపులు తెరవడంతో కనీసం టిఫిన్ కూడా తినకుండా క్యూలో నిలబడ్డాం. దీంతో నీరసించి కళ్లు తిరిగాయి. గంతే అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి ఈమాటలు అక్కడి జనం అవాక్కయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోమవారం బ్రాందీ షాపులు తెరుచుకున్నాయి. శివకుడికి ఎంతో పవిత్రమైన రోజు సోమవారం బ్రాందీ షాపులు తియ్యడంతో కొందరు ఓం నమ: శివాయ అంటూ లిక్కర్ షాప్ ల ముందు బారులుతీరారు. కొందరు ఏకంగా గోవిందా గోవిందా అంటూ బ్రాందీ షాపుల ముందు క్వాటర్ బాటిల్స్ కోసం పడికాపులు కాయడం.. అందులోనే కిక్కు ఉంది అంటూ మద్యం ప్రియులు ఊగిపోతున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమింటంటే… ఆ యువతి అంతగా కళ్లుతిరిగి పడిపోయినా.. ఆ తర్వాత కాసేపు ఆగి మళ్లీ టానిక్ వైన్ షాప్ ముందు క్యూలో అందరితో పాటు నిలబడటమే.