దీదీ షాకిచ్చారా…కేసీఆర్ కి !

జాతీయ స్థాయిలో భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కల్గిన రాజకీయ పార్టీలను ఏకతాటిమీదకి తీసుకొచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఆయన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మమతతో కలిసి మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై తామిద్దరం చర్చించినట్టు కేసీఆర్‌ వెల్లడించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని, ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయి చర్చించానన్నారు. త్వరలోనే పటిష్ట ప్రణాళికతో ముందుకొస్తామని, మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.అయితే కేసీఆర్ తో జరిపిన చర్చల వివరాలపై మీడియాతో మాట్లాడేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపించలేదు. భునవేశ్వర్ లో నవీన్ పట్నాయక్ .. ఫెడరల్ ఫ్రంట్ గురించి.

దీదీ షాకిచ్చారా...కేసీఆర్ కి ! - Telugu Bullet

ఒక మాట మాట్లాడినప్పిటీకి మమతా బెనర్జీ మాత్రం.. అసలేమీ మాట్లాడలేదు. కనీసం ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవ్వాలన్న మాటలు కూడా ఆమె మాట్లాడలేదు. కేసీఆర్ కూడా తాము కచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని… అందులో మమతా బెనర్జీ ఉంటారన్న నమ్మకాన్ని కల్పించలేకపోయారు. పైగా హైదరాబాద్ లాగా ఏర్పాటు చేయాల్సింది కాదని వ్యాఖ్యానించారు. దీంతో మమతా బెనర్జీ కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ పై ఎలాంటి సానుకూలత వ్యక్తం చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. కోల్‌కతాలో కాళీమాత ఆలయాన్ని సందర్శించిన అనంతరం కేసీఆర్‌ ఢిల్లీకి పయనమవుతారు. రేపటి నుంచి రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్‌ డిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. అంతేకాకుండా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ ఆయన భేటీ అవ్వనున్నారు.