మన్మోహన్ కంటే మోడీనే దారుణమా..?

differences-between-manmohan-singh-and-narendra-modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆర్థికవేత్తగా, మంచి వ్యక్తిత్వం గల మనిషిగా మాజీ ప్రధాని మన్మోహన్ ను అందరూ గౌరవిస్తారు. ప్రతిపక్షాలు కూడా బొగ్గు స్కాం విషయంలో ఆయన దోషి అని చెప్పడానికి ముందుకు రాలేదంటే.. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అసలు మన్మోహన్ కు సోది చెప్పడం ఇష్టం ఉండదు. పెద్దగా మాట్లాడరు. సైలంట్ గా పనిచేసుకుపోతారు. కానీ ఆ బలహీనతే ఆయుధంగా బీజేపీ మౌనముని అని ప్రచారం చేసింది.

మరి ఇప్పుడు మోడీ వచ్చి ఏం చేస్తున్నారంటే.. మాట్లాడుతున్నారుగా అని అమిత్ షా వెటకారం చేశారు. ప్రధాని అంటే మాట్లాడితే చాలదు.. పని చేయాలి. కానీ మోడీ మాత్రం మాటలే బాగా చెబుతున్నారు. పనులు మాత్రం చెప్పినట్లు జరగడం లేదు. అంతర్గత అశాంతి గురించి పక్కనపెడితే.. సరిహద్దులో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.

మోడీ ఎన్ని మాటలు చెప్పినా.. కీలకమైన విషయాల్లో మన్మోహన్ సైలంటుగానే వాటిని కంట్రోల్ చేయగలిగారు. కాకపోతే అవినీతి డైరక్టుగా గాంధీ కుటుంబం నుంచే ఉంది కాబట్టి ఆయన ఏం చేయలేకపోయారు. అయితే మోడీ మాత్రం అవినీతి లేదని ఊదరగొడుతూనే మీడియాను మేనేజ్ చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా రాయడానికి మీడియా ఎంత భయపడుతుందో చెప్పడానికి యూపీలో శిశుమరణాలపై చేసిన రిపోర్టింగే తిరుగులేని సాక్ష్యం.

మరిన్ని వార్తలు:

భూసర్వే కోసమే సిట్టింగుల మంత్రం

వివాదల పుట్టకే ప్రమోషన్లా మోడీ