అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ‘నా పేరు సూర్య’ చిత్రానికి ముందు వరుసగా నాలుగు అయిదు సక్సెస్‌లను దక్కించుకున్న అల్లు అర్జున్ ఆ చిత్రంతో మాత్రం చేదు ఫలితాన్ని చవిచూశాడు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొంది, విడుదలైన నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్ అవ్వడంతో బన్నీ కాస్త జాగ్రత్త పడుతున్నాడు. తన తదుపరి చిత్రం విషయంలో ఛాన్స్ తీసుకోవద్దని, లైట్‌గా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో విక్రమ్ కుమార్ మూవీని పక్కకు పెట్టి మరి దిల్‌రాజు బ్యానర్లో ‘సభకు నమస్కారం’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దిల్‌రాజు కొన్ని నెలల క్రితం నాని కోసం అంటూ ‘సభకు నమస్కారం’ టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించడం జరిగింది. నాని వరుసగా చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల బన్నీతో దిల్‌రాజు ప్లాన్ చేశాడేమో అని అంతా అనుకున్నారు. కాని గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అని, అసలు బన్నీతో తాము సినిమా అనుకోవడం లేదు అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను రెండు చిత్రాలపైనే ఫోకస్ పెట్టాను అని ఆ చిత్రాలు పూర్తి అయిన తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాను అంటూ దిల్‌రాజు ప్రకటించాడు. అల్లు అర్జున్‌తో మూవీ ఉంటుందా లేదా అనే విషయంలో దిల్‌రాజు క్లారిటీ ఇవ్వలేదు. సభకు నమస్కారం అనే చిత్రం అల్లు అర్జున్‌తో చేయడం లేదు అని మాత్రం చెప్పాడు. మరేదైనా కథాంశంతో బన్నీ దిల్‌రాజుల కాంబోలో మూవీ వస్తుందేమో చూడాలి. బన్నీ కొత్త సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.