సమంత బామ్మగా మారబోతుందా…?

Samantha Acting In 70 Years Grandma In Haliwood

ముద్దుగుమ్మ సమంత ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో మనకు చాలా అందంగా కనిపించింది. కాని త్వరలో ఆమె నటించబోతున్న చిత్రంలో 70 ఏళ్ల వృద్దురాలిగా కనిపించబోతుంది. హాలీవుడ్‌లో వచ్చిన ‘మిస్‌ గ్రానీ’ చిత్రంను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నందిని రెడ్డి ప్రస్తుతం మిస్‌ గ్రానీ స్క్రిప్ట్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చే పనిలో ఉంది. మిస్‌ గ్రానీ కథ ఏంటీ అంటే 70 ఏళ్ల వృద్దురాలు తనకు దక్కిన మంత్ర శక్తులతో 25 ఏళ్ల అమ్మాయిగా మారే అవకాశం దక్కించుకుంటుంది. ఆ వృద్దురాలు అమ్మాయిగా మారడంకు కారణం ఏంటీ, అసలు ఎలా ఆమెకు పవర్స్‌ వచ్చాయి అనేది ఆసక్తికరంగా సినిమాలో చూపించబోతున్నారు.

70 ఏళ్ల వృద్దురాలి పాత్ర కోసం ఇప్పటికే సమంతకు మేకప్‌ టెస్టు అయ్యిందని, మూడు నాలుగు రకాల మేకప్స్‌ను టెస్ట్‌ చేసి, చివరకు ఒక గెటప్‌ను ఫైనల్‌ చేయడం జరిగింది. రెండు విభిన్న పాత్రల్లో సమంత కనిపించబోతుంది. 70 ఏళ్ల వృద్దురాలి పాత్రలో కొద్ది సమయం కనిపించనుండగా, ఎక్కువ శాతం 25 ఏళ్ల అమ్మాయిగానే సమంత కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న కారణంగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంచి సబ్జెక్ట్‌ కనుక, సమంత ఇంత సాహసం చేస్తుంది కనుక మరే దర్శకుడు అయినా సినిమాను చేస్తే న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నందిని రెడ్డిపై సమంత పూర్తి నమ్మకంను పెట్టుకుని సినిమాకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది.